Share News

పక్కాగా గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:16 AM

పాడేరులోని తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాలలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

పక్కాగా గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పాడేరులోని తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాలలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణను చక్కగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. దేశభక్తి, ఆచార, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలుండాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పరిమిళను ఆదేశించారు. వేడుకల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలు స్టాళ్లు, శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారుల నిర్మాణం, అత్యవసర వైద్య సేవలకు డ్రోన్ల వినియోగంపైనా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు, ఉత్తమ సర్పంచులు, ఉత్తమ రైతులు, ఉత్తమ విద్యార్థులను సత్కరించడం, జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాల అందజేతకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ఆర్‌టీసీ డీఎం శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్థఽక శాఖాధికారి జయరాజు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, ఏడీఎంహెచ్‌వో టీఎన్‌ ప్రతాప్‌, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:16 AM