Share News

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ

ABN , Publish Date - May 02 , 2026 | 12:23 AM

నర్సీపట్నంలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం అభివృద్ధికి రూ.1.99 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం శివపురంలోని మత్స్య శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం జలవనరుల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ
Fish Farming

రూ.1.99 కోట్లతో అంచనాలు

సీఎస్‌ఆర్‌ నిధులతో వినియోగంలోకి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

నర్సీపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం అభివృద్ధికి రూ.1.99 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం శివపురంలోని మత్స్య శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం జలవనరుల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ కేంద్రం చాలా ఏళ్ల నుంచి నిరుపయోగంగా వుందని, సీఎస్‌ఆర్‌ నిధులతో దీనిని వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.1.99 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపాలని జిల్లా మత్స్యశాఖ అధికారి జి.విజయను అదేశించారు. ఈ కేంద్రం వినియోగంలోకి వస్తే జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో చేపల పెంపకానికి ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకురావాల్సిన అవసరం వుందని చెప్పారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో వీవీరమణ, మునిసిపల్‌ కమిషనర్‌ సురేంద్ర, జల వనరుల శాఖ అధికారులు వున్నారు.

Updated Date - May 02 , 2026 | 07:38 AM