Share News

వర్షంతో ఊరట

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:11 AM

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం వర్షం కురవడంతో జనం ఊరట చెందారు.

వర్షంతో ఊరట
గొలుగొండ మండలం జోగంపేటలో వర్షం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత వాన

అనకాపల్లి టౌన్‌/మాడుగుల/కృష్ణాదేవిపేట/దేవరాపల్లి/బుచ్చెయ్యపేట/చీడికాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం వర్షం కురవడంతో జనం ఊరట చెందారు. అనకాపల్లి పట్టణంలో మధ్యాహ్నం, సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. మాడుగులలో మధ్యాహ్నం ఒక మోస్తరు వర్షం కురిసింది. గొలుగొండ మండలం ఏఎల్‌పురం, చోద్యం, నాగాపురం, కొంగశింగి, పాతకృష్ణాదేవిపేట, జోగంపేట, గొలుగొండ తదితర గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దేవరాపల్లి మండలంలో శనివారం సాయంత్రం వర్షం పడడంతో జనం ఊరట చెందారు. బుచ్చెయ్యపేట మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. చీడికాడ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది.

Updated Date - Oct 18 , 2026 | 12:11 AM