Share News

రాచపల్లి భూముల సాగుదారులకు ఊరట

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:17 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల సాగుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

రాచపల్లి భూముల సాగుదారులకు ఊరట
రైతుల సాగులో ఉన్న కొండపోరంబోకు భూమి

- స్పీకర్‌ అయ్యన్న చొరవతో ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం

- రేపటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందంటున్న అధికారులు

మాకవరపాలెం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల సాగుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో మొత్తం 406.85 ఎకరాల కొండ పోరంబోకు భూమిని ప్రభుత్వం తీసుకుంది. సాగుదారులకు ఎకరాకు రూ.6 లక్షల పరిహారం ఇస్తున్నట్టు మార్చి నెలలో ప్రభుత్వం నుంచి అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి డివిజనల్‌ అధికారి తెలియజేశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.9 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో స్పీకర్‌ అయ్యన్న మాట్లాడి ఒప్పించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ప్రభుత్వం ఇచ్చిన ఒప్పంద పత్రాలపై రైతులు సంతకాలు చేసి రెవెన్యూ అధికారులకు అందజేస్తున్నారు. మొదటి విడతగా 150 మంది రైతులకు సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ అయ్యేలా రెవెన్యూ అధికారులు జాబితాలను తయారు చేశారు. స్పీకర్‌ అయ్యన్న చొరవ వల్లే తమకు ఎకరాకు రూ.9 లక్షల పరిహారం అందనున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 01:17 AM