Share News

ఎప్పటికప్పుడు భద్రతా తనిఖీలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:58 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని నాలుగు డివిజన్లలో భద్రత నిర్వహణ చర్యలపై జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఎప్పటికప్పుడు భద్రతా తనిఖీలు

డీఆర్‌ఎంలు, విభాగాధిపతులకు దక్షిణ కోస్తా రైల్వే జీఎం ఆదేశాలు

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని నాలుగు డివిజన్లలో భద్రత నిర్వహణ చర్యలపై జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్వే ఆస్తులు, మౌలిక సదుపాయాల నిర్వహణలో మెరుగైన పద్ధతులు అవలంబించాలని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు భద్రతను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సిబ్బంది పనితీరును సమీక్షించాలన్నారు. భద్రత నిర్వహణ ప్రమాణాలు, కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలు, ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 12:58 AM