Share News

రిజిస్ర్టేషన్స్‌ ఆదాయం రూ.1,174 కోట్లు

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:13 AM

విశాఖపట్నంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత మూడేళ్లుగా ప్రభుత్వానికి వేయి కోట్ల రూపాయలు చొప్పున ఆదాయం వస్తోంది.

రిజిస్ర్టేషన్స్‌ ఆదాయం రూ.1,174 కోట్లు

గడచిన ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 78 శాతం సాధన

రూ.320.63 కోట్లతో ప్రథమ స్థానంలో మధురవాడ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

రూ.225.8 కోట్లతో ద్వితీయ స్థానంలో సూపర్‌బజార్‌

రూ.117.78 కోట్లతో తృతీయ స్థానంలో ద్వారకానగర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత మూడేళ్లుగా ప్రభుత్వానికి వేయి కోట్ల రూపాయలు చొప్పున ఆదాయం వస్తోంది. జిల్లాలో తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, గడచిన (2025-26) ఆర్థిక సంవత్సరం రూ.1,174.37 కోట్ల ఆదాయం సాధించాయి. ప్రభుత్వం రూ.1,500 కోట్ల లక్ష్యాన్ని ఇవ్వగా అందులో 78 శాతం సాధించాయి. తొమ్మిదింటిలో మధురవాడ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం సింహభాగం సాధించి రూ.320.62 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. సూపర్‌ బజారు కార్యాలయం రూ.225.8 కోట్లతో ద్వితీయ స్థానంలోను, ద్వారకానగర్‌ కార్యాలయం రూ.117.78 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి.

అంతకుముందు ఏడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.1,050.58 కోట్లు రాగా, మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రూ.263.9 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్‌బజార్‌ కార్యాలయం రూ.247.51 కోట్లతో ద్వితీయ స్థానంలో, ద్వారకానగర్‌ కార్యాలయం రూ.110.55 కోట్లతో తృతీయ స్థానంలో నిలిచాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.1,032.42 కోట్ల ఆదాయం రాగా అందులో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రూ.235.38 కోట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. సూపర్‌బజార్‌ కార్యాలయం రూ.219.36 కోట్లతో రెండో స్థానంలో, ద్వారకా నగర్‌ కార్యాలయం రూ.116.92 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి.

మధురవాడలో అత్యధిక రిజిస్ట్రేషన్లు

ఉపేంద్ర, జిల్లా రిజిస్ట్రార్‌, విశాఖపట్నం

జిల్లాలో మధురవాడ ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. అక్కడే ఎక్కువ గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మితమవుతున్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగి ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు ఆ కార్యాలయం రూ.300 కోట్ల మార్క్‌ను దాటింది. సూపర్‌బజారు కార్యాలయం ఏటా రూ.200 కోట్లకు పైగా ఆదాయం నమోదు చేస్తోంది. ద్వారకానగర్‌ కార్యాలయం గత మూడేళ్లుగా రూ.110 కోట్లు దాటి వసూలు చేస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో...

-----------------------------------------------

కార్యాలయం ఆదాయం

-----------------------------------------------

మధురవాడ రూ.320.63 కోట్లు

సూపర్‌బజార్‌ రూ.225.8 కోట్లు

ద్వారకానగర్‌ రూ.117.78 కోట్లు

గాజువాక రూ.115.81 కోట్లు

ఆనందపురం రూ.94.56 కోట్లు

భీమునిపట్నం రూ.86.99 కోట్లు

పెందుర్తి రూ.83.21 కోట్లు

పెదగంట్యాడ రూ.74.89 కోట్లు

గోపాలపట్నం రూ.54.7 కోట్లు

------------------------------------------------

Updated Date - Apr 14 , 2026 | 01:13 AM