Share News

తగ్గిన మిరియాల ధర

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:09 AM

గిరిజన ప్రాంతంలో మిరియాల ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం కిలో మిరియాలు రూ.700 ధరకు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మిరియాల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దిగుబడులు తగ్గినప్పటికీ ధర ఆశాజనంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం జీకేవీధి వారపు సంతలో వర్తకులు కిలో రూ.600కు కొనుగోలు చేశారు.

తగ్గిన మిరియాల ధర
రైతులు జీకేవీధి సంతకు తీసుకొచ్చిన మిరియాలు

- గత వారం కిలో రూ.700కు వర్తకులు కొనుగోలు

- తాజాగా రూ.600 పలికిన ధర

- ధర తగ్గడంతో రైతులు దిగాలు

గూడెంకొత్తవీధి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాల ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం కిలో మిరియాలు రూ.700 ధరకు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మిరియాల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దిగుబడులు తగ్గినప్పటికీ ధర ఆశాజనంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం జీకేవీధి వారపు సంతలో వర్తకులు కిలో రూ.600కు కొనుగోలు చేశారు. వారం రోజుల వ్యవధిలో రూ.వంద ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేరళ కొచ్చిన్‌ మార్కెట్‌లో కిలో ఎండు మిరియాలు రూ.750-780 ధర పలుకుతోంది. గిరిజన ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం వల్ల వర్తకులు ఒకేసారి ధర తగ్గించేశారు. కాఫీ తరహాలో మిరియాలకు జీసీసీ, ఐటీడీఏ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 01:09 AM