Share News

జలాశయాలకు తగ్గిన వరద

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:05 AM

జిల్లాలోని ప్రధాన జలాశయాలకు శుక్రవారం కూడా వరద ప్రవాహం కొనసాగింది. అయితే గురువారంతో పోలిస్తే వరద పోటు కొంతమేర తగ్గింది. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా, శుక్రవారం పినకోట, సమ్మెద గెడ్డల నుంచి మూడు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 112.75 మీటర్లకు చేరింది. నీటిమట్టం 113.5 మీటర్లు దాటితే ఇన్‌ఫ్లోనుబట్టి స్పిల్‌వే గేట్లు ఎత్తుతామని డీఈఈ సత్యంనాయుడు తెలిపారు.

జలాశయాలకు తగ్గిన వరద
వరద నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్న రైవాడ జలాశయం

గరిష్ఠస్థాయికి చేరువలో రైవాడ రిజర్వాయర్‌

దేవరాపల్లి/ మాడుగుల రూరల్‌/ నాతవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన జలాశయాలకు శుక్రవారం కూడా వరద ప్రవాహం కొనసాగింది. అయితే గురువారంతో పోలిస్తే వరద పోటు కొంతమేర తగ్గింది. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా, శుక్రవారం పినకోట, సమ్మెద గెడ్డల నుంచి మూడు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 112.75 మీటర్లకు చేరింది. నీటిమట్టం 113.5 మీటర్లు దాటితే ఇన్‌ఫ్లోనుబట్టి స్పిల్‌వే గేట్లు ఎత్తుతామని డీఈఈ సత్యంనాయుడు తెలిపారు.

నాతవరం మండలం తాండవ రిజర్వాయర్‌లోకి 1,500 క్యూసెక్కుల వరద నీరుచేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా, శుక్రవారం సాయంత్రం 371 అడుగులకు చేరింది. తుఫాన్‌ ప్రభావంతో గత మూడు రోజుల్లో నీటిమట్టం ఏడు అడుగులు పెరిగింది.

మాడుగుల రూరల్‌ మండలంలోని పెద్దేరు జలాశయానికి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లుకాగా శుక్రవారం సాయంత్రం 136.5 మీటర్లకు చేరడంతో అధికారులు ఒక గేటు తెరిచి 500 క్యూసెకుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 01:05 AM