Share News

రాజుపాకలులో ఎరుపు ముల్లంగి సాగు

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:25 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న రాజుపాకలు గ్రామంలో ఓ రైతు ఎరుపు ముల్లంగి సాగు చేస్తున్నారు.

రాజుపాకలులో ఎరుపు ముల్లంగి సాగు
ఎరుపు ముల్లంగి పంటను చూపిస్తున్న రైతు రాజు

చింతపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న రాజుపాకలు గ్రామంలో ఓ రైతు ఎరుపు ముల్లంగి సాగు చేస్తున్నారు. దుంపజాతికి చెందిన కూరగాయల పంటలో ముల్లంగి ఒకటి. ముల్లంగి సాధారణంగా తెలుపు వర్ణంలో ఉండడం చూస్తుంటాం. రాజుపాకలు గ్రామంలో రాజు అనే రైతు స్ట్రాబెర్రీతో పాటు ఎకరం విస్తీర్ణంలో అరుదైన ఎరుపు ముల్లంగి, పింక్‌, ఎల్లో కాలీఫ్లవర్‌ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ముల్లంగి పంట సీజన్‌ కావడంతో దిగుబడులు ప్రారంభమయ్యాయి. ముల్లంగి ఎరుపు వర్ణంలో ఉండడంతో స్థానికులు, పర్యాటకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కిలో ముల్లంగి రూ.50 ధరకు రైతు విక్రయిస్తున్నారు. కాగా ఎరుపు ముల్లంగిలో విటమిన్‌-సీ పుష్కలంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు చర్మ సౌందర్యం పెంచుతుందని, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు మెదడు పనితీరు మెరుగు పరుస్తుందని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 11:25 PM