Share News

ఎరుపెక్కిన చంద్రుడు

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:00 AM

నగరంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల తరువాత చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది.

ఎరుపెక్కిన చంద్రుడు

నగరంలో స్పష్ట్రంగా కనిపించిన గ్రహణం

విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల తరువాత చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. నిత్యం తెల్లని వర్ణంలో మెరిసిపోయే చంద్రుడు ఎరుపు రంగులో కనిపించాడు. రంగు మారిన చంద్రుడిని ఫొటోలు, వీడియోలు తీసేందుకు నగరవాసులు ఉత్సాహం చూపించారు. ఇకపోతే, గ్రహణం కారణంగా ఆలయాలను మూసివేశారు. గ్రహణ సమయంలో నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి.

Updated Date - Mar 04 , 2026 | 01:00 AM