Share News

రెండేళ్ల విజయోత్సవానికి సిద్ధం

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:19 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి-సంక్షేమం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు.

రెండేళ్ల విజయోత్సవానికి సిద్ధం

అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించేలా కార్యక్రమం

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి-సంక్షేమం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్‌ సంబంధితశాఖల అధికారులతో కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ రీజి యన్‌కు కేటాయించిన పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి పై కార్యక్రమం జరుగుతోందని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసేలా ఏర్పా ట్లు చేపట్టాలని సూచించారు. వేదిక వద్ద ప్రొటోకాల్‌ నిబంధనలకు అనుగుణంగా డయాస్‌, సీటింగ్‌ ఏర్పాట్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, స్వాగత ఏర్పాట్లు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలను పకడ్బందీగా నిర్వ హించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమానికి హాజ రయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టుబులు, పారిశ్రామిక వృద్ధి అంశా న్ని ప్రతిబింబించేలా వివిధ శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, జిల్లాలో రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, ఆకర్షించిన పెట్టుబడులు, కల్పించిన ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విజయాలను ఆకర్షణీయంగా ప్రదర్శించాలన్నారు. వేదిక వద్ద పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, మొబైల్‌ టాయిలెట్లు, వైద్య సేవలు, అగ్ని మాపక భద్రత, నిరంతర విద్యుత్‌ సరఫరా వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలు, జిల్లాలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలపై సమగ్ర సమాచారాన్ని ప్రదర్శించాలన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, ఇన్‌చార్జి డీఆర్వో టి.గోవింద్‌, ఆర్డీవో దిలీప్‌ చక్రవర్తి, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:19 AM