Share News

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సిద్ధం

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:25 AM

జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. మొత్తం 120 వార్డుల్లో 18,37,901 మంది 1,990 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. 28న పోలింగ్‌ జరగనున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మేయర్‌ ఎన్నికకు గులాబీ రంగు, కార్పొరేటర్‌కు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ప్రకటించారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సిద్ధం

జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు

పది శాతం అదనంగా ముద్రించాలని నిర్ణయం

మేయర్‌కు గులాబీ రంగు,

కార్పొరేటర్‌కు తెలుపు రంగు..

తొమ్మిది ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ఆర్డర్‌

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. మొత్తం 120 వార్డుల్లో 18,37,901 మంది 1,990 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. 28న పోలింగ్‌ జరగనున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మేయర్‌ ఎన్నికకు గులాబీ రంగు, కార్పొరేటర్‌కు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ప్రకటించారు.

జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 36,75,802 (18,37,901+18,37,901) బ్యాలెట్‌పత్రాలు కావాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుజాగ్రత్తగా పది శాతం బ్యాలెట్‌ పత్రాలను అదనపు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో 40,49,700 (20,24,850+20,24,850) బ్యాలెట్‌ పత్రాలను సమకూర్చుకునేలా ఏర్పాట్లుచేయాలని జీవీఎంసీ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీని ప్రకారం ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాలకు అవసరమైన పేపర్‌ను కొనుగోలు చేసి జీవీఎంసీ పరిధిలోని తొమ్మిది ప్రింటింగ్‌ ప్రెస్‌లకు పంపించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున పోటీలో నిలిచే మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులపై గురువారం ఉదయానికి పూర్తి స్పష్టత వస్తుంది. ఆ వెంటనే ముద్రణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ముద్రణ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ పత్రాలను ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి నేరుగా జోనల్‌కార్యాలయాల్లోని స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలిస్తారు. అక్కడ నుంచి 27వ తేదీన పోలింగ్‌ కేంద్రాలకు పంపిణీ చేస్తారు.

Updated Date - Oct 22 , 2026 | 01:25 AM