మునిసిపల్ పోరుకు రెఢీ
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:11 AM
జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్, కౌన్సిరల్ పదవులకు పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను ఆయా పట్టణాల ఎన్నికల అధికారులు ఆదివారం ప్రకటించారు. రెండుచోట్లా నర్సీపట్నంలో రెండు వార్డులకు (26, 27) ఒక్కో నామిషన్ మాత్రమే మిగలడంతో అవి ఏకగ్రీవం (టీపీపీకి) అయిన్నట్టు వెల్లడించారు. మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీలో వున్నారు. ఎలమంచిలో 32 వార్డుల్లో 77 మంది పోటీ చేస్తున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడించిన ఎన్నికల అధికారులు
ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు అధికారికంగా ప్రకటన
నర్సీపట్నం, ఎలమంచిలి చైర్‌పర్సన్ పదవులకు త్రిముఖ పోటీ
నర్సీపట్నంలో 26, 27 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం
మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీ
ఎలమంచిలిలో 32 వార్డులకు 77 మంది..
నవంబరు ఒకటిన పోలింగ్, 3న ఓట్ల లెక్కిపు
నర్సీపట్నం/ ఎలమంచిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్, కౌన్సిరల్ పదవులకు పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను ఆయా పట్టణాల ఎన్నికల అధికారులు ఆదివారం ప్రకటించారు. రెండుచోట్లా నర్సీపట్నంలో రెండు వార్డులకు (26, 27) ఒక్కో నామిషన్ మాత్రమే మిగలడంతో అవి ఏకగ్రీవం (టీపీపీకి) అయిన్నట్టు వెల్లడించారు. మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీలో వున్నారు. ఎలమంచిలో 32 వార్డుల్లో 77 మంది పోటీ చేస్తున్నారు.
మునిసిపల్ ఎన్నికలకు ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 19వ తేదీన పరిశీలన , 21వ తేదీ బుధవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగాయి. అదే రోజున పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అయితే రాయలసీమలోని రెండు కార్పొరేషన్లు, మరో రెండు మునిసిపాలిటీల్లో ఎంపిక చేసిన వార్డుల్లో నామినేషన్లను మళ్లీ స్వీకరించాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు తుది జాబాతాలను విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 28వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల ఎన్నికల అధికారులు పోటీలో వున్న అభ్యర్థుల పేర్లు, పార్టీలు, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులను ఆదివారం ప్రకటించారు.
చైర్‌పర్సన్ పదవికి త్రిముఖ పోటీ
నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ పదవికి ముగ్గురు చొప్పున పోటీ పడుతున్నారు. నర్సీపట్నంలో చింతకాయల పద్మావతి (కూటమి- టీడీపీ), చింతకాయల అనిత (వైసీపీ), బైపురెడ్డి చిట్టిసంధ్యారాణి (ఇండిపెండెంట్); ఎలమంచిలిలో పిల్లా రమాకుమారి (కూటమి- బీజేపీ), బొద్దపు తులసి (వైసీపీ), దొడ్డి శాంతి (కాంగ్రెస్) పోటీలో వున్నారు. ఆయా అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డుల విషయానికి వస్తే.. నర్సీపట్నం మునిసిపాలిటీలో 40 వార్డులకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం 86 నామినేషన్లు మిగిలాయి. 26, 27 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలాయి. దీంతో ఈ రెండు వార్డులు టీడీపీకి ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీలో వున్నారు. వీటిలో 31 వార్డులో ద్విముఖ పోటీ , ఆరు వార్డుల్లో త్రిముఖం, ఒక వార్డులో నలుగురు పోటీ పడుతున్నారు. ఎలమంచిలి మునిసిపాలిటీలో 32 వార్డుల కౌన్సిలర్ పదవులకు 77 నామినేషన్లు మిగిలాయి. 22 వార్డుల్లో ముఖాముఖి, ఏడు వార్డుల్లో త్రిముఖ, మూడు వార్డుల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. నవంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగుతుంది. మూడో తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు. చైర్‌పర్సన్ అభ్యర్థులకు గులాబీ రంగు, కౌన్సిలర్ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలట్ పత్రాలను వినియోగిస్తారు.
జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో
ఆరు వార్డులు.. 20 మంది పోటీ
అనకాపల్లి టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖనగర పాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లోని ఆరు వార్డులకు నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం 20 మందికి చెందిన నామినేషన్లు మిగిలాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ ఎన్నికల అధికారులు వార్డుల వారీగా పోటీలో వున్న అభ్యర్థుల వివరాలను ఆదివారం వెల్లడించారు. 107వ వార్డులో ముఖాముఖి, 108, 109, 112 వార్డుల్లో త్రిముఖ, 110వ వార్డులో చతుర్ముఖ పోటీ నెలకొంది. 111వ వార్డులో ఐదుగురు పోటీ చేస్తున్నారు. జోన్ పరిధిలోని అన్ని వార్డులు మహిళలకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. 107వ వార్డులో మాదంశెట్టి చినతల్లి (టీడీపీ), పన్నీరు వెంకటలక్ష్మి (వైసీపీ), 108వ వార్డులో కొణతాల సింధూజ (టీడీపీ), బొడ్డేడ సరోజని (వైసీపీ), పెంటకోట తులసీ (స్వతంత్ర), 109వ వార్డులో బుద్ద జ్యోతి (జనసేన), కర్రి లలిత (వైసీపీ), కోరిబిల్లి నూకభారతి (కాంగ్రెస్), 110వ వార్డులో తాడి శాంతికుమారి (జనసేన), ఉగ్గిన జ్యోత్స్న పద్మజ (వైసీపీ), గౌరీపట్నపు దేవి (కాంగ్రెస్), పర్రి దుర్గాదేవి (బీఎస్పీ), 111వ వార్డులో పలకా యశోద (బీజేపీ), శీలం నదియా (వైసీపీ), కోలపర్తి అరుణకుమారి (స్వతంత్ర), బోనాల దేవి (స్వతంత్ర), సేనాపతి జ్యోతి (స్వతంత్ర), 112వ వార్డులో ఆళ్ల వైష్ణవి (జనసేన), జాజుల ప్రసన్నలక్ష్మి (వైసీపీ), తుట్టా ప్రియాంక (కాంగ్రెస్) పోటీలో వున్నారు.