Share News

గ్రేటర్‌ పోరుకు రెఢీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 01:25 AM

జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. నామినేషన్ల దాఖలు, ఉప సంహరణ, అనంతరం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా పడిన అభ్యర్థుల ప్రకటనను ఆదివారం అధికారులు విడుదల చేశారు.

గ్రేటర్‌ పోరుకు రెఢీ

పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడించిన ఎన్నికల అధికారులు

ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు అధికారికంగా ప్రకటన

మేయర్‌ పదవికి 15 మంది పోటీ

120 వార్డు కార్పొరేటర్లకు 573 మంది

అత్యధికంగా 95వ వార్డులో 13 మంది పోటీ

4,9,20,21,27,38,43,67,74,89,103,107 వార్డుల్లో ముఖాముఖీ

విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. నామినేషన్ల దాఖలు, ఉప సంహరణ, అనంతరం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా పడిన అభ్యర్థుల ప్రకటనను ఆదివారం అధికారులు విడుదల చేశారు. జీవీఎంసీ మేయర్‌ పదవికి 15 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ పదవికి 29 మంది నామినేషన్లు దాఖలుచేయగా ఎనిమిది నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారు. మిగిలిన 21 నామినేషన్లు ఆమోదించగా ఆరుగురు ఉపసంహరించుకోవడంతో 15 మంది తుదిపోటీలో నిలిచారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.దయానిధి అభ్యర్థుల తుదిజాబితాను ఆదివారం విడుదల చేశారు. కాగా 120 వార్డులకు 1,672 మంది నామినేషన్లు దాఖలుచేయగా, చివరకు 573 మంది పోటీలో నిలిచారు. 95వ వార్డులో అత్యధికంగా 13 మంది పోటీలో నిలవగా, అత్యల్పంగా 4, 9, 20,21,27,38,43,67, 74,89,103, 107 వార్డుల్లో ముఖాముఖీ పోటీ నెలకొంది.

మేయర్‌ బరిలో 15 మంది

క్రమసంఖ్య అభ్యర్థిపేరు పార్టీ

1. కరణం కీర్తనగ్రేస్‌ బీఎస్పీ

2. దేవర నాగసునందాదేవి కాంగ్రెస్‌

3. ముక్కాశ్రావణి కూటమి (టీడీపీ)

4. వరుదు కళ్యాణి వైఎస్‌ఆర్‌సీపీ

5. నమ్మి భవాని బీసీవై

6. ఫ్రాన్సినమ్మ అత్తిలి ఇండిపెండెంట్‌

7. గొంప వెంకటపద్మావతి ఇండిపెండెంట్‌

8. శైలజ ఇండిపెండెంట్‌

9. ప్రియాంక దండి ఇండిపెండెంట్‌

10. పకృతిదేవిక ఇండిపెండెంట్‌

11. బోర సంతోషి ఇండిపెండెంట్‌

12. లిఖిత లండ ఇండిపెండెంట్‌

13. వాండ్రాసి శాంతికుమారి ఇండిపెండెంట్‌

14. వియ్యపు ఉమ ఇండిపెండెంట్‌

15. షేక్‌ దౌలతున్నీసా ఇండిపెండెంట్‌

120 వార్డులు 573 మంది అభ్యర్థులు

జీవీఎంసీ కార్పొరేటర్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదల

విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో కార్పొరేటర్లుగా పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ఆదివారం వెల్లడించారు. భీమిలి జోన్‌లో ఐదు వార్డులకు 19 మంది, మధురవాడ జోన్‌లో ఏడు వార్డులకు 27 మంది, తూర్పుజోన్‌లో 18 వార్డులకు 70 మంది, దక్షిణజోన్‌లో 16 వార్డులకు 77 మంది, ఉత్తరజోన్‌లో 20 వార్డులకు 86 మంది, పశ్చిమజోన్‌లో 17 వార్డులకు 72 మంది, గాజువాకజోన్‌లో 19 వార్డులకు 139 మంది, అగనంపూడి జోన్‌లో ఐదువార్డులకు 28 మంది, అనకాపల్లి జోన్‌లో ఆరువార్డులకు 20 మంది, పెందుర్తిజోన్‌లో ఏడువార్డులకు 35 మంది పోటీలో నిలిచారు.

ఒకటో వార్డు నుంచి ఏడుగురు, రెండోవార్డు నుంచి ముగ్గురు, మూడో వార్డు నుంచి ముగ్గురు, నాలుగో వార్డు నుంచి ఇద్దరు, ఐదో వార్డు నుంచి నలుగురు, ఆరోవార్డు నుంచి ఎనిమిది మంది, ఏడో వార్డు నుంచి ముగ్గురు, ఎని మిదోవార్డు నుంచి ముగ్గురు, తొమ్మిదోవార్డు నుంచి ఇద్దరు, పదో వార్డు నుంచి నలుగురు, 11వ వార్డు నుంచి నలుగురు, 120వ వార్డు నుంచి ముగ్గురు, 12వ వార్డు నుంచి నలుగురు, 13వ వార్డు నుంచి ఐదుగురు, 14వ వార్డు నుంచి ముగ్గురు, 15వ వార్డు నుంచి ముగ్గురు, 16వ వార్డు నుంచి నలుగురు, 17వార్డు నుంచి ముగ్గురు, 18వార్డు నుంచి నలుగురు, 19వ వార్డు నుంచి ముగ్గురు, 20వ వార్డు నుంచి ఇద్దరు, 21వ వార్డు నుంచి ఇద్దరు, 22 వ వార్డు నుంచి ముగ్గురు, 23వ వార్డు నుంచి ఐదుగురు, 24వ వార్డు నుంచి ఐదుగురు, 25వ వార్డు నుంచి ఐదుగురు, 26వ వార్డు నుంచి ఎనిమిది మంది, 27వ వార్డు నుంచి ఇద్దరు, 28వ వార్డు నుంచి ఐదుగురు, 29వ వార్డు నుంచి నలుగురు, 30వ వార్డు నుంచి ముగ్గురు, 31వ వార్డు నుంచి నలుగురు, 32వ వార్డు నుంచి నలుగురు, 33వ వార్డు నుంచి ఏడుగురు, 34వ వార్డు నుంచి ముగ్గురు, 35వ వార్డు నుంచి నలుగురు, 36వ వార్డు నుంచి ఏడుగురు, 37వ వార్డు నుంచి ఆరుగురు, 38వ వార్డు నుంచి ఇద్దరు, 39వ వార్డు నుంచి ఏడుగురు, 40వ వార్డు నుంచి ఆరుగురు, 41వ వార్డు నుంచి తొమ్మిదిమంది, 42వ వార్డు నుంచి ఐదుగురు, 43వ వార్డు నుంచి ఇద్దరు, 44వ వార్డు నుంచి ముగ్గురు, 45వ వార్డు నుంచి ఐదుగురు, 46వ వార్డు నుంచి ఆరుగురు, 47వ వార్డు నుంచి ఇద్దరు, 48వ వార్డు నుంచి ఐదుగురు, 49వ వార్డు నుంచి ఐదుగురు, 50వ వార్డు నుంచి ఐదుగురు, 51వ వార్డు నుంచి ముగ్గురు, 52వ వార్డు నుంచి నలుగురు, 53వ వార్డు నుంచి ముగ్గురు, 54వ వార్డు నుంచి ఐదుగురు, 55వ వార్డు నుంచి ముగ్గురు, 56వ వార్డు నుంచి ముగ్గురు, 57వ వార్డు నుంచి నలుగురు, 58వ వార్డు నుంచి ఏడుగురు, 59వ వార్డు నుంచి నలుగురు, 60వ వార్డు నుంచి నలుగురు, 61వ వార్డు నుంచి ఆరుగురు, 62వ వార్డు నుంచి ముగ్గురు, 63వ వార్డు నుంచి ఇద్దరు, 64వ వార్డు నుంచి ఏడుగురు, 65వ వార్డు నుంచి ఐదుగురు, 66వ వార్డు నుంచి ఐదుగురు, 67వ వార్డు నుంచి ఇద్దరు, 68వ వార్డు నుంచి ఆరుగురు, 69వ వార్డు నుంచి నలుగురు, 70వ వార్డు నుంచి ముగ్గురు, 71వ వార్డు నుంచి ముగ్గురు, 72వ వార్డు నుంచి నలుగురు, 73వ వార్డు నుంచి ఆరుగురు, 74వ వార్డు నుంచి ఇద్దరు, 75వ వార్డు నుంచి ముగ్గురు, 76వ వార్డు నుంచి ఎనిమిది మంది, 77వ వార్డు నుంచి నలుగురు, 78వ వార్డు నుంచి ముగ్గురు, 79వ వార్డు నుంచి ఐదుగురు, 80వ వార్డు నుంచి నలుగురు, 81వ వార్డు నుంచి ఆరుగురు, 82వ వార్డు నుంచి నలుగురు, 83వ వార్డు నుంచి నలుగురు, 84వ వార్డు నుంచి నలుగురు, 85వ వార్డు నుంచి ఐదుగురు, 86వ వార్డు నుంచి పది మంది, 87వ వార్డు నుంచి ఆరుగురు, 88వవార్డు నుంచి ఆరుగురు, 89వవార్డు నుంచి ఇద్దరు, 90వ వార్డు నుంచి ఎనిమిదిమంది, 91వ వార్డు నుంచి తొమ్మిదిమంది, 92వ వార్డు నుంచి పదిమంది, 93వ వార్డు నుంచి ఏడుగురు, 94వ వార్డు నుంచి ఏడుగురు, 95వ వార్డు నుంచి 13 మంది, 96వ వార్డు నుంచి నలుగురు, 97వ వార్డు నుంచి పది మంది, 98వ వార్డు నుంచి ఆరుగురు, 99వ వార్డు నుంచి ఏడుగురు, 100వ వార్డు నుంచి తొమ్మిదిమంది, 101వ వార్డు నుంచి 12 మంది, 102వ వార్డు నుంచి ఐదుగురు, 103వ వార్డు నుంచి ఇద్దరు, 104వ వార్డు నుంచి పదిమంది, 105వ వార్డు నుంచి ముగ్గురు, 106వ వార్డు నుంచి ఎనిమిదిమంది, 107వ వార్డు నుంచి ఇద్దరు, 108వ వార్డు నుంచి ముగ్గురు, 109వ వార్డు నుంచి ముగ్గురు, 110వ వార్డు నుంచి నలుగురు, 111వ వార్డు నుంచి ఐదుగురు, 112వ వార్డు నుంచి ముగ్గురు, 113వ వార్డు నుంచి నలుగురు, 114వ వార్డు నుంచి ఆరుగురు, 115వ వార్డు నుంచి ఏడుగురు, 116వ వార్డు నుంచి ముగ్గురు, 117వ వార్డు నుంచి నలుగురు, 118ద వార్డు నుంచి ఐదుగురు, 119వ వార్డు నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 01:25 AM