Share News

పసికందు మృతి ఘటనపై ఆర్డీవో విచారణ

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:47 AM

స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మూడు రోజుల మగశిశువు మృతి చెందిన సంఘటన పై కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో షేక్‌ ఆయీషా శనివారం వైద్యాలయంలో విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌లను ఆమె విచారణ చేశారు.

పసికందు మృతి ఘటనపై ఆర్డీవో విచారణ
- వైద్యాలయం సమావేశమందిరంలో విచారణ చేపడుతున్న ఆర్డీవో షేక్‌ ఆయీషా

- డీసీహెచ్‌ఎస్‌, ఎన్టీఆర్‌ వైద్యాలయం సూపరింటెండెంట్‌ నుంచి వివరాల సేకరణ

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మూడు రోజుల మగశిశువు మృతి చెందిన సంఘటన పై కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో షేక్‌ ఆయీషా శనివారం వైద్యాలయంలో విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌లను ఆమె విచారణ చేశారు. జరిగిన సంఘటనను వైద్యులు ఆర్డీవోకు వివరించారు. ఆమె కూడా జరిగిన సంఘటన పై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందినట్టు తండ్రి వేగి శ్రీనివాసరావుతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో ఆర్డీవో విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో వైద్యులతో పాటు పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్‌, తహశీల్దార్‌ ఆనందరావు, వైద్యాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు ఉన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:47 AM