Share News

ఆర్‌అండ్‌బీ ఈఈ బాల సుందరంబాబు మృతి

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:39 PM

రోడ్ల, భవనాల శాఖ స్థానిక ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఈఈ) కె.బాల సుందరంబాబు(62) అనారోగ్యంతో శుక్రవారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు.

ఆర్‌అండ్‌బీ ఈఈ బాల సుందరంబాబు మృతి
కె.బాల సుందరంబాబు(ఫైల్‌)

జిల్లా కలెక్టర్‌, అధికారులు సంతాపం

పాడేరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

రోడ్ల, భవనాల శాఖ స్థానిక ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌(ఈఈ) కె.బాల సుందరంబాబు(62) అనారోగ్యంతో శుక్రవారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. గత ఐదేళ్లుగా ఆయన స్థానిక రోడ్ల, భవనాల శాఖ ఈఈగా పనిచేస్తున్నారు. ఆయనకు సౌమ్యుడైన అధికారిగా పేరుతుంది. ఇటీవల ఆయన గుండె సంబంధ సమస్య ఏర్పడడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో ఆయన పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఇలా జరగడం విషాదం. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జిల్లా అధికారులు ఆయన మృతికి సంతాపం తెలిపి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చక్కని అధికారిని కోల్పోయామని ఆయనతో పనిచేసిన అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - Jan 23 , 2026 | 10:39 PM