Share News

మినీ మార్ట్‌లుగా రేషన్‌ డిపోలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:22 AM

నగరంలో 150 రేషన్‌ డిపోలను మినీ మార్ట్‌ (కిరాణా దుకాణం)లుగా మార్చనున్నారు. ప్రజలకు అందుబాటులో, షాపు నిర్వహణకు అనువుగా ఉండే డిపోలను ఇందుకోసం ఎంపిక చేశారు. మినీ మార్ట్ట్‌లో వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల సరుకులను అమ్మకానికి ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా కార్డుదారులకు దగ్గరలో అన్ని సరుకులు లభించేలా మినీ మార్ట్‌లను తీర్చిదిద్దనున్నారు.

మినీ మార్ట్‌లుగా రేషన్‌ డిపోలు

నగరంలో 150 డిపోలు ఎంపిక

అందుబాటులో అన్ని సరుకులు

డీలర్లకు బ్యాంకుల నుంచి

రుణం ఇప్పించేందుకు ముందుకువచ్చిన

పౌర సరఫరాల శాఖ

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

నగరంలో 150 రేషన్‌ డిపోలను మినీ మార్ట్‌ (కిరాణా దుకాణం)లుగా మార్చనున్నారు. ప్రజలకు అందుబాటులో, షాపు నిర్వహణకు అనువుగా ఉండే డిపోలను ఇందుకోసం ఎంపిక చేశారు. మినీ మార్ట్ట్‌లో వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల సరుకులను అమ్మకానికి ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా కార్డుదారులకు దగ్గరలో అన్ని సరుకులు లభించేలా మినీ మార్ట్‌లను తీర్చిదిద్దనున్నారు.

రేషన్‌ డీలర్ల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. విజయవాడ, విశాఖపట్నంతోపాటు మరికొన్ని నగరాలను ఇందుకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలో మూడు సర్కిళ్ల పరిధిలో 150 డిపోలను మార్ట్‌లుగా మార్చేందుకు అధికారులు ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతంలో నాలుగు మండలాలను ఈ ప్రతిపాదన నుంచి మినహాయించారు.

డిపోల్లో ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ వరకు బియ్యం, పంచదార, ఇతర సరుకులు పంపిణీ చేస్తుంటారు. అనంతరం పక్షం రోజులపాటు డిపోలు మూసివేస్తుంటారు. మినీ మార్ట్‌లుగా మార్చినట్టయితే నెల పొడవునా డీలర్లకు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంటుందని పౌర సరఫరాల శాఖ భావించింది. మినీ మార్ట్‌ కోసం బ్యాంకుల నుంచి లక్ష రూపాయలు రుణంగా ఇప్పించేందుకు పౌర సరఫరాల శాఖ ముందుకువచ్చింది. వీధుల్లో కిరాణా దుకాణాల్లో ఉన్న విధంగా అన్ని సరుకులు మినీ మార్ట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Updated Date - Jul 30 , 2026 | 01:22 AM