ఎన్టీఆర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:27 AM
స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్య నిపుణులు గవరపాలెం ప్రాంతానికి చెందిన ఒక మహిళకు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గర్భాశయంలో ఉన్న ఎనిమిది కిలోల కణితిని తొలగించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. వైద్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం..
ఎన్టీఆర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
మహిళ గర్భాశయం నుంచి ఎనిమిది కిలోల కణితి తొలగింపు
అనకాపల్లి టౌన్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్య నిపుణులు గవరపాలెం ప్రాంతానికి చెందిన ఒక మహిళకు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. గర్భాశయంలో ఉన్న ఎనిమిది కిలోల కణితిని తొలగించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. వైద్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గవరపాలెం రాణిగారిపూలతోట ప్రాంతానికి చెందిన లంక లక్ష్మి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకువచ్చి పరీక్షలు చేయించారు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు (గడ్డలు) ఉన్నట్టు వైద్య పరిక్షల్లో బయటపడింది. దీంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పగా, కుటుంబ సభ్యులు అంగీకరించారు. గురువారం సూపరింటెండెంట్ పర్యవేక్షణలో గైనకాలజిస్టు డాక్టర్ దుర్గా కల్యాణి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ నాగలక్ష్మి శస్త్ర చికిత్స చేసి ఎనిమిది కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు.