Share News

శరవేగంగా బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:27 AM

అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ సొంత నిధులు సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

శరవేగంగా బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణం
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బ్లడ్‌బ్యాంకు భవనం

- డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సొంత నిధులతో పనులు

- బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుల పర్యవేక్షణ

అరకులోయ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ సొంత నిధులు సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బేస్‌మెంట్‌ పనులు పూర్తి చేయడంతో పాటు పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ పనులు మూడు రోజుల్లో పూర్తి చేసి శ్లాబ్‌ వేసేందుకు డెక్కింగ్‌ పనులు చేపడతామని పనులను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్‌ ప్రతినిధులు శివ, రమేశ్‌ తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయిస్తున్నామన్నారు. ఈ భవన నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని వారు తెలిపారు.

Updated Date - Oct 02 , 2026 | 12:27 AM