బాలికపై అత్యాచారం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:53 AM
మండలంలోని ఒక గ్రామంలో ఏడేళ్ల బాలికపై బుధవారం రాత్రి కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోని నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇందుకు సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ జి.రవికుమార్ గురువారం మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నిందితుడి అరెస్టు
కొత్తూరు (అనకాపల్లి), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఒక గ్రామంలో ఏడేళ్ల బాలికపై బుధవారం రాత్రి కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోని నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇందుకు సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ జి.రవికుమార్ గురువారం మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అనకాపల్లి మండలంలోని ఒక గ్రామంలో జరుగుతున్న పండుగకు హాజరుకావడానికి బంధువుల ఇంటికి వచ్చారు. సాయంత్రం అదే గ్రామంలో మరో బంధువు భోజనానికి పిలవడంతో ముగ్గురు పిల్లలతో (ఇద్దరు బాలికలు, ఒక బాలుడు) కలిసి అక్కడకు వెళ్లారు. రాత్రి ఏడు గంటల సమయంలో పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తరువాత స్థానికుడైన సీతిని రాజు అనే వ్యక్తి వచ్చి, సమీపంలో జరుగున్న సాంస్కృతిక కార్యక్రమాన్ని చూపిస్తానంటూ ఏడేళ్ల బాలికను దాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సమీపంలో జరుగుతున్న సాంస్కృతి కార్యక్రమాల డీజే శబ్దాల వల్ల బాలిక కేకలు వేసినప్పటికీ ఇతరులకు వినిపించలేదు. అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే చంసేస్తానని బెదిరించాడు. కొద్దిసేపటి తరువాత బాలిక తల్లి ఇంటి నుంచి బయటకురాగా, ఏడేళ్ల కుమార్తె కనిపించలేదు. మిగిలిన ఇద్దరిని వాకబు చేయగా.. ఓ వ్యక్తి వచ్చి మేడపైకి తీసుకెళ్లాడానికి చెప్పారు. దీంతో ఆమె డాబాపైకి వెళ్లగా, సీతిని రాజు కిందకు దూకి పారిపోయాడు. ఈ సంఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం డిఎస్పీ ఎం.శ్రావణి, సీఐ అశోక్‌కుమార్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. నిందితుడు సీతిని రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం అనకాపల్లి మండలం మార్టూరు పంచాయతీ పరిధిలోని గుంకలలోవ శివారులో అరెస్టు చేశారు.