మత సామరస్యానికి ప్రతీక రంజాన్
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:02 AM
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత లభిస్తుందని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యనిర్వాహణాధికారి ఎం.సత్యపద్మ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఒక్కడ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జేసీతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనం, సత్‌ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు.
ఉపవాస దీక్షతో మానసిక, శారీరక పవిత్రత
జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్
అధికారికంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
అనకాపల్లి టౌన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత లభిస్తుందని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యనిర్వాహణాధికారి ఎం.సత్యపద్మ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఒక్కడ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జేసీతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనం, సత్‌ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యేలు కొణతాల, బండారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు అధ్యక్షుడు పీఎస్‌ఎన్ హుస్సేన్, కార్యదర్శి ఎండీ జిలానీ, తదితరులు పాల్గొన్నారు.