చెక్కపై రామమందిరం, రాముని రూపం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:52 AM
మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన కళాకారుడు దార్ల రవి అవకాశం వచ్చినప్పుడు తన కళానైపుణ్యతను ప్రదర్శిస్తున్నాడు. కార్పెంటర్‌గా కుటుంబపోషణకు పనిచేస్తూ, మరోవైపు సందర్భానుసారం తన సృజనాత్మకతతో ఎన్నో కళాఖండాలను తయారు చేస్తున్నాడు.
నక్కపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన కళాకారుడు దార్ల రవి అవకాశం వచ్చినప్పుడు తన కళానైపుణ్యతను ప్రదర్శిస్తున్నాడు. కార్పెంటర్‌గా కుటుంబపోషణకు పనిచేస్తూ, మరోవైపు సందర్భానుసారం తన సృజనాత్మకతతో ఎన్నో కళాఖండాలను తయారు చేస్తున్నాడు. తాజాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చెక్కపై రామ మందిరం, శ్రీరాముని రూపాన్ని అద్భుతంగా చెక్కాడు. ఇందుకు తనకు గంటన్నర సమయం పట్టిందని తెలిపాడు.