Share News

వర్ష బీభత్సం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:32 AM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో గురువారం అర్ధరాత్రి మునిసిపాలిటీ పరిధిలో భారీ ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

వర్ష బీభత్సం
కట్టుపాలెం సమీపంలో కూలిన చెట్టు

- మునిసిపాలిటీ పరిధిలో భారీ ఈదురుగాలులు

- పలు చోట్ల నేలకొరిగిన చెట్లు

ఎలమంచిలి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో గురువారం అర్ధరాత్రి మునిసిపాలిటీ పరిధిలో భారీ ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అగ్నిమాపక, మునిసిపల్‌, పోలీసు సిబ్బంది చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. అలాగే మునిసిపాలిటీలోని కట్టుపాలెం, కొత్తపాలెం, తెరువుపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లపై చెట్లు నేలకూలడంతో అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగించారు. ఈ వర్షాలకు ఎలమంచిలిలో పెద్దగా నష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:33 AM