నర్సీపట్నంలో ఈదురు గాలులతో వర్షం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:35 AM
మునిసిపాలిటీ పరిధిలో పెదబొడ్డేపల్లి, సుబ్బారాయుడుపాలెంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫారాలు, చెట్లు నేలకొరిగాయి. పెదబొడ్డేపల్లి శ్రీరామ్‌నగర్ కాలనీలో రామాలయం ఆవరణలో భారీ రావి చెట్టు కూకటివేళ్లతోసహా కూలిపోయింది. ఆలయం ముందున్న ధ్వజ స్తంభం విరిగిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫారాలు ఒరిగిపోయాయి. మునిసిపల్ కమిషనర్ సురేంద్ర, విద్యుత్ శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. నర్సీపట్నం-విశాఖపట్నం మార్గంలో సుబ్బారాయుడుపాలెం ప్రధాన రహదారిలో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి, ఎక్స్‌కవేటర్లతో చెట్లను తొలగింపజేసి ట్రాఫిక్ క్రమబద్ధికరిచారు.
4ఎన్‌పీ4:
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
నర్సీపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలో పెదబొడ్డేపల్లి, సుబ్బారాయుడుపాలెంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫారాలు, చెట్లు నేలకొరిగాయి. పెదబొడ్డేపల్లి శ్రీరామ్‌నగర్ కాలనీలో రామాలయం ఆవరణలో భారీ రావి చెట్టు కూకటివేళ్లతోసహా కూలిపోయింది. ఆలయం ముందున్న ధ్వజ స్తంభం విరిగిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫారాలు ఒరిగిపోయాయి. మునిసిపల్ కమిషనర్ సురేంద్ర, విద్యుత్ శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. నర్సీపట్నం-విశాఖపట్నం మార్గంలో సుబ్బారాయుడుపాలెం ప్రధాన రహదారిలో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి, ఎక్స్‌కవేటర్లతో చెట్లను తొలగింపజేసి ట్రాఫిక్ క్రమబద్ధికరిచారు.
దేవరాపల్లిలో వర్షం
దేవరాపల్లి, జూన్4 (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో వర్షం పడింది. అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీక్షనంగా కాసింది. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు పది గంటలకే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఇళ్లల్లో ఫ్యాన్లువేసుకున్నప్పటికీ ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. సాయంత్రం మోస్తరు వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం చెందారు. కాగా మాడుగులలో తేలికపాటి వర్షం పడింది.