పెదబయలులో వర్షం
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:16 PM
పెదబయలులో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉండి మధ్యాహ్నం స్వల్పంగా ఎండ కాసింది.
పెదబయలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పెదబయలులో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉండి మధ్యాహ్నం స్వల్పంగా ఎండ కాసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆకాశం మేఘవృతమై నాలుగున్నర గంటల నుంచి వర్షం కురిసింది. దీంతో మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి.