Share News

నగరంలో వర్షం

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:01 AM

నగరంలో ఆదివారం ఉదయం సుమారు అర గంటపాటు జోరున వర్షం కురిసింది.

నగరంలో వర్షం

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఆదివారం ఉదయం సుమారు అర గంటపాటు జోరున వర్షం కురిసింది. అల్పపీడనం మధ్య భారతం వైపుగా తరలిపోయినా సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో తెల్లవారుజామున వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు జలమమయ్యాయి. మురుగుకాల్వలు పొంగాయి. వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వినాయకచవితి పూజసామగ్రి కొనుగోళ్లకు మార్కెట్లకు వచ్చిన జనం తడిసిముద్దయ్యారు. రైతుబజార్లు, బయట మార్కెట్‌లలో అమ్మకానికి ఉంచిన సామగ్రి తడిసిపోయాయి. కొన్నిచోట్ల మట్టి ప్రతిమలు కరిగిపోయాయి. నరవలో 26.0, బుచ్చిరాజుపాలెంలో 23.5, ఎండాడ తులసినగర్‌ పార్కులో 23.0, షీలానగర్‌లో 20.5, మధురవాడ జాతరలో 20.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇదిలావుండగా తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న నగర వాసులకు రెండురోజులగా కురుస్తున్న వర్షాలు కొంత మేలు చేశాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది.

Updated Date - Sep 14 , 2026 | 01:01 AM