Share News

నగరంలో వర్షం

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:35 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

నగరంలో వర్షం

విశాఖపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘాలు ఆవరించడంతో చిరుజల్లులు కురిశాయి. మధ్యలో కొంతసేపు జల్లులు ఆగాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభమైన వర్షం ఒంటి గంట సమంయలో పెరిగి మోస్తరుగా కురిసింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌, పాత జైలురోడ్డు, జగదాంబ, బీచ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై వాహనాలు నడిపేవారంతా తడిసిపోయారు. కొద్దిరోజులుగా ఎండలతో నెలకొన్న వేడి వాతావరణం శని, ఆదివారాలు కురిసిన జల్లులు, మోస్తరు వర్షానికి చల్లబడింది.

Updated Date - Aug 24 , 2026 | 12:35 AM