Share News

మన్యంలో వర్షం

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:50 AM

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురవగా, ఇతర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మన్యంలో వర్షం
పాడేరులో వర్షం

- పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీరు

పాడేరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురవగా, ఇతర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలులో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరడంతో ఖరీఫ్‌ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. కాగా మంగళవారం కొయ్యూరులో 31.2, ముంచంగిపుట్టులో 28.4, జీకేవీధిలో 27.4, అనంతగిరిలో 26.7, అనంతగిరిలో 26.7, అరకులోయలో 26.5, పాడేరు, జి.మాడుగులలో 25.5, చింతపల్లి, డుంబ్రిగుడలో 25.2, హుకుంపేటలో 24.3, పెదబయలులో 22.9, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

చింతపల్లి: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ డి.ఆదిలక్ష్మి తెలిపారు. పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం వాతావరణ సమాచారాన్ని ప్రకటించారు. ఆగస్టు రెండో తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 4.1 మిల్లీమీటర్లు, గరిష్ఠంగా 10.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. గాలిలో తేమ 80-90 శాతం ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 12:50 AM