పలు మండలాల్లో వర్షం
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:36 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
కోటవురట్లలో రెండు గంటలపాటు కుండపోతగా వాన
56 మిల్లీమీటర్లుగా నమోదు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. తరువాత గొలుగొండ, కోటవురట్ల, ఎస్.రాయవరం, ఎలమంచిలి, మునగపాక, రాంబిల్లి మండలాల్లో వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. తరువాత వర్షం కురిసింది. కోటవురట్ల మండలంలో సుమారు రెండు గంటలపాటు కుండపోతగా వాన పడింది. రహదారులు వర్షం నీటితో కాలువలను తలపించాయి. లోతట్టు ప్రదేశాలు, పంట పొలాల్లో నీరు నిలిచింది. గెడ్డలు, వాగుల్లో నీరు ప్రవహించింది .మొత్తం మీద 56 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా మండలాల్లో వాతావరణం చట్టబడడంతో ప్రజలు ఉపశమనం చెందారు. మిగిలినచోట్ల ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగాయి.