Share News

జీకేవీధి, చింతపల్లిలో వర్షం

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:14 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి పది గంటల వరకు పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి.

జీకేవీధి, చింతపల్లిలో వర్షం
చింతపల్లిలో వర్షం

చింతపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. ఉదయం నుంచి పది గంటల వరకు పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రాత్రి వరకు మోస్తరు వర్షం పడింది. రెండు మండలాల్లోనూ రైతులు వరి నాట్లు కేవలం 20 శాతం మాత్రమే వేశారు. వర్షాలు పడితేనే తప్ప నాట్లు వేయలేమని భావిస్తున్న తరుణంలో తాజాగా కురిసిన వర్షంతో కాస్త ఊరట చెందారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, కుమడ, సంగడ, పెదబయలు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయి.

Updated Date - Jul 26 , 2026 | 11:14 PM