Share News

వర్షం

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:10 AM

నగరం, పరిసరాల్లో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది.

వర్షం

నగరంలో చల్లబడిన వాతావరణం

గాజువాకలో 26 మిల్లీమీటర్లు నమోదు

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

నగరం, పరిసరాల్లో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. సాయంత్రం నుంచి మేఘాలు ఆవరించాయి. ఆ తరువాత ఉరుములు మొదలయ్యాయి. ఈదురుగాలులు వీచాయి. పిడుగులతోపాటు మొదలైన వర్షం రాత్రి ఎనిమిది గంటలకు జోరందుకుంది. పెందుర్తి, గాజువాక, ములగాడ, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, సీతమ్మధార, ఆరిలోవ తదితర ప్రాంతాల్లో 15 నిమిషాల నుంచి అరగంట పాటు వర్షం కురిసింది.

వేసవి సీజన్‌లో వర్షం కురవడంతో నగరంలో వాతావరణం చల్లబడింది. బొగ్గు, వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన నగర వాసులకు ఈ వర్షం కొంత వరకు ఊరటనిచ్చింది. చెట్లు, భూమి తడవడం, బొగ్గు నిల్వలు ఉండే ప్రాంతం తడిసిపోవడంతో కాలుష్యం కొద్దిరోజులు తగ్గుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న సముద్రంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరం, పరిసరాల్లో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసిందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గాజువాకలో 26, ములగాడలో 25.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - Mar 21 , 2026 | 01:11 AM