జరిమానాల రూపేణా రైల్వేకు రూ.26.21 కోట్లు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:25 AM
టికెట్ తనిఖీల సమయంలో జరిమానాల ద్వారా వాల్తేరు రైల్వే డివిజన్‌కు గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) రూ.26.21 కోట్ల ఆదాయం సమకూరింది.
850 కేసులు నమోదు చేసి రూ.50.2 లక్షలు వసులు చేసిన టీటీఈ అప్పలరాజు
టికెట్ తనిఖీ సిబ్బందిని సత్కరించిన డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
టికెట్ తనిఖీల సమయంలో జరిమానాల ద్వారా వాల్తేరు రైల్వే డివిజన్‌కు గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) రూ.26.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోల్చితే 3.05 శాతం అధికం. కాగా విజయనగరంలో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ వై.అప్పలరాజు అత్యధికంగా 850 కేసులు నమోదుచేసి రూ.50.2 లక్షలు జరిమానా రూపంలో వసూలుచేసి డివిజన్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్ బొహ్రా శుక్రవారం తన కార్యాలయంలో వై.అప్పలరాజుతోపాటు టికెట్ తనిఖీల్లో ప్రతిభచూపిన కె.సంతోషిరావు, సంబిలి, పీవీ త్రివిక్రమరావు, తదితరులకు పతకం, ధ్రువపత్రం అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, చిత్తశుద్ధి పాటించి వాల్తేరు డివిజన్ ఆదాయాభివృద్ధికి కృషిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్, ఇతర కమర్షియల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.