అభివృద్ధి పట్టాలపై రైల్వే స్టేషన్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:33 AM
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగో చేపట్టిన నాలుగో నంబరు ప్లాట్‌ఫారం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడో ప్లాట్‌ఫారానికి పక్కనున్న రైల్వే ట్రాక్‌కు ఉత్తరం వైపున (లక్ష్మీదేవిపేట సమీపాన) సుమారు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా రైల్వే లైను, ప్లాట్ ఫారం నిర్మాణం చేపట్టారు. అయితే కొత్తగా వేసే లైను, ప్లాట్‌ఫారాన్ని సరుకు రవాణాకు మాత్రమే వినియోగించేలా పనులు జరుగుతున్నాయి. పడమర వైపున లక్ష్మీదేవిపేట రైల్వే గేటు సమీపం నుంచి తూర్పు వైపున సిగ్నల్ పాయింట్ వరకు 940 మీటర్ల పొడవున రైల్వే ట్రాక్‌తోపాటు పాటు 800 మీటర్ల పొడవున, 16 మీటర్ల వెడల్పు, ఒకటిన్నర మీటర్ల ఎత్తులో ప్లాట్‌ఫారం నిర్మిస్తున్నారు.
అనకాపల్లిలో కొత్తగా నాలుగో ప్లాట్‌ఫారం నిర్మాణం
ఇదే సమయంలో మరో ట్రాక్ సైతం..
పూర్తిగా సరుకు ఎగుమతులు, దిగుమతుల కోసం వినియోగం
సూపర్ ఫాస్ట్ రైళ్లకు తొలగనున్న సమస్య
అనకాపల్లి టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగో చేపట్టిన నాలుగో నంబరు ప్లాట్‌ఫారం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడో ప్లాట్‌ఫారానికి పక్కనున్న రైల్వే ట్రాక్‌కు ఉత్తరం వైపున (లక్ష్మీదేవిపేట సమీపాన) సుమారు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా రైల్వే లైను, ప్లాట్ ఫారం నిర్మాణం చేపట్టారు. అయితే కొత్తగా వేసే లైను, ప్లాట్‌ఫారాన్ని సరుకు రవాణాకు మాత్రమే వినియోగించేలా పనులు జరుగుతున్నాయి. పడమర వైపున లక్ష్మీదేవిపేట రైల్వే గేటు సమీపం నుంచి తూర్పు వైపున సిగ్నల్ పాయింట్ వరకు 940 మీటర్ల పొడవున రైల్వే ట్రాక్‌తోపాటు పాటు 800 మీటర్ల పొడవున, 16 మీటర్ల వెడల్పు, ఒకటిన్నర మీటర్ల ఎత్తులో ప్లాట్‌ఫారం నిర్మిస్తున్నారు. మూడు, నాలుగు ప్లాట్‌ఫారాల మధ్య నుంచి మరో రైల్వే ట్రాక్ (ప్లాట్ ఫారం లేకుండా) వుంది. అనకాపల్లిలో స్టాప్ లేని సూపర్ ఫాస్ట్ రైళ్లతోపాటు గూడ్స్ రైళ్లు ఈ లైన్ మీదుగా వెళతాయి. కొత్తగా వేసే లైనుతోపాటు ఫ్లాట్ ఫారాన్ని అనకాపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు సరుగుడు, సూబాబుల్ వంటి కలపతోపాటు ఇతర వస్తువుల ఎగుమతులు, అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి ఎరువులు, ఆహార ఉత్పత్తుల దిగుమతులకు వినియోగిస్తారు. అందువల్లనే 16 మీటర్ల వెడల్పుతో ప్లాట్‌ఫారం నిర్మిస్తున్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మూడో నంబరు ప్లాట్‌ఫారం వైపు ఉన్న మరో లైనుపై ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. దీనివల్ల ఇక్కడ హాల్ట్ లేకుండా విజయవాడ వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్లు, గూడ్స్ రైళ్లు మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమయంలో ఆయా మెయిన్ లైన్లలోని ప్లాట్ ఫారాలపై పాసింజర్ రైళ్లు ఆగివుంటే.. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, గూడ్స్ రైళ్లను ఔటర్‌లో నిలుపుదల చేయాల్సి వస్తున్నది. కొత్త ప్లాట్‌ఫారం అందుబాటులోకి వస్తే ఔటర్ సిగ్నల్ వద్ద రైళ్లు వేచివుండాల్సిన అవసరం వుండదని అంటున్నారు. సరుకు లోడింగ్/ అన్‌లోడింగ్ కోసం తక్కువ ఎత్తులో ప్లాట్‌ఫారం నిర్మాణంతోపాటు మరో ట్రాక్ నిర్మాణం జరుగుతున్నదని, ఈ ఏడాది చివరినాటికి పనులు పూర్తయ్యే అవకాశం వుందని స్టేషన్ మేనేజర్ కె.రామకృష్ణ తెలిపారు.