అర్జీలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:24 PM
పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశం
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 153 వినతులు స్వీకరణ
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమెమాట్లాడారు. సమస్యలపై ప్రజలు సమర్పించే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి గడవులోగా పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నదని, ఈ క్రమంలో అధికారులు పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ప్రతి అధికారి సమగ్ర సమాచారంతో పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని, ఏదైనా కారణంతో హాజరుకాలేకుంటే ముందస్తు అనుమతి పొందాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులు, సోమవారం మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు మండల స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలన్నారు. మండల, గ్రామ స్థాయిలోని వివిధ శాఖల అధికారులు స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, సబ్‌కలెక్టర్ సాహిత్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు గిరిజనుల నుంచి 153 వినతులను స్వీకరించారు. వాటిలో వివిధ శాఖలకు సంబంధించి 83, రెవెన్యూ సంబంధ సమస్యలపై 70 వినతులు అందాయి. మీకోసంలో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు ప్రజలు 1100 నంబరు కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని జేసీ శ్రీపూజ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్, డీఈవో భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా ఖజానాధికారి అనిల్‌కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి వి.రమణారావు, జిల్లా టూరిజం ఆఫీసర్ పి.చలపతిరావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ రాధామాధవి, పీజీఆర్‌ఎస్ అసిస్టెంట్ నోడల్ అధికారి వి.ధర్మరాజు, ఎల్‌డీఎం మాతునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.