Share News

అర్జీలకు సత్వర పరిష్కారం

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:57 PM

మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌ అధికారులకు సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమంలో గిరిజనుల నుంచి అధికారులు 137 వినతులను స్వీకరించారు.

అర్జీలకు సత్వర పరిష్కారం
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, తదితరులు

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 137 వినతులు స్వీకరణ

పాడేరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌ అధికారులకు సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమంలో గిరిజనుల నుంచి అధికారులు 137 వినతులను స్వీకరించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ చిదానందం, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, ఆర్డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావులతో కలిసి ఈవారం పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు.

1100 కాల్‌ సెంటర్‌ సేవలు వినియోగించుకోవాలి

మీకోసం కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌ సూచించారు. అర్జీదారులుకాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తినాయిక్‌, డీఈవో కె.రామకృష్ణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , జాతీయ రహదారుల డీటీ వి.ధర్మరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 10:57 PM