రైళ్లలో నాణ్యమైన టీ, కాఫీ విక్రయం
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:17 AM
రైలు ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంలో భాగంగా ఆన్‌బోర్డు టీ, కాఫీ విక్రయ వ్యవస్థను వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఆన్‌బోర్డు వెండింగ్ వ్యవస్థను ఏపీ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఐదు లీటర్ల సామర్థ్యం గల ప్రతి ఇన్సులేటెడ్ థర్మోస్ కంటైనర్ ద్వారా పరిశుభ్రమైన టీ, కాఫీ విక్రయించనున్నారని, దాదాపు 35 మంది ప్రయాణికులకు ఒకేసారి సేవలందించగలరని పేర్కొన్నారు.
వినూత్న విక్రయ వ్యవస్థను ప్రారంభించిన డీఆర్‌ఎం లలిత్‌బొహ్రా
విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):
రైలు ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంలో భాగంగా ఆన్‌బోర్డు టీ, కాఫీ విక్రయ వ్యవస్థను వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఆన్‌బోర్డు వెండింగ్ వ్యవస్థను ఏపీ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఐదు లీటర్ల సామర్థ్యం గల ప్రతి ఇన్సులేటెడ్ థర్మోస్ కంటైనర్ ద్వారా పరిశుభ్రమైన టీ, కాఫీ విక్రయించనున్నారని, దాదాపు 35 మంది ప్రయాణికులకు ఒకేసారి సేవలందించగలరని పేర్కొన్నారు. ఇన్సులేటెడ్ కంటైనర్‌లో వేడి (ఉష్ణోగ్రత) ఎక్కువ సేపు ఉంటుందన్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపులను అనుమతించేందుకు వెండర్ గాడ్జెట్‌లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం రైళ్లలో టీ, కాఫీ విక్రయించే సమయంలో వెండర్లు క్యాన్‌లను సీట్లపై, నేలపై ఉంచడంతో అపరిశుభ్రత నెలకొంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఇన్సులేటెడ్ థర్మోస్ కంటైనర్ ద్వారా చేపట్టే అమ్మకాలు ప్రయాణికులకు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తాయన్నారు. ప్రయాణికుల అభిప్రాయాల మేరకు ఆన్‌బోర్డు వెండింగ్ సిస్టమ్‌ను కేవలం ఆన్‌బోర్డులోనే కాకుండా ప్లాట్‌ఫామ్‌లకు కూడా విస్తరించనున్నామన్నారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలందించాలనే ఉద్దేశంతో ఆన్‌బోర్డు వెండింగ్ వ్యవస్థను రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్‌ను, ఐఆర్‌సీటీసీ విభాగం ప్రతినిధులను అభినందించారు.