పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:10 AM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) పై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
స్కాన్ చేసి అభిప్రాయాలు తెలపాలని ప్రజలకు పిలుపు
విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) పై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్యూఆర్ కోడ్‌లు దెబ్బతిన్నా, తొలగిపోయినా వెంటనే పునరుద్ధరించాలన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలు పొందిన ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవల పై తమ అభిప్రాయాలు, సూచనలను తెలియ జేయాలన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలను మరింత మెరుగు పర్చేందుకు ప్రజల ఫీడ్‌బ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.