Share News

పంప్డ్‌ స్టోరేజ్‌ పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:04 AM

సీలేరులో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌదా (హైడల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ రవీంద్రరెడ్డి స్థానిక అధికారులు, మెగా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు రెండో దశకు అటవీ అనుమతులు ఇస్తూ పర్యావరణ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌదా చీఫ్‌ ఇంజనీర్‌ రవీంద్రరెడ్డి సీలేరులో పర్యటించారు.

పంప్డ్‌ స్టోరేజ్‌ పనులు వేగవంతం చేయాలి
పంప్డ్‌స్టోరేజ్‌ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న జెన్‌కో అధికారుల బృందం

విద్యుత్‌ సౌదా హైడల్‌ సీఈ రవీంద్రరెడ్డి ఆదేశం

ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఈ

సీలేరు కాంప్లెక్సు ఇంజనీర్లతో సమీక్ష

సీలేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

సీలేరులో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌదా (హైడల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ రవీంద్రరెడ్డి స్థానిక అధికారులు, మెగా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు రెండో దశకు అటవీ అనుమతులు ఇస్తూ పర్యావరణ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌదా చీఫ్‌ ఇంజనీర్‌ రవీంద్రరెడ్డి సీలేరులో పర్యటించారు. ప్రతిపాదిత పంప్డ్‌ స్టోరేజీ ప్రాంతాల్లో సీలేరు కాంప్లెక్సు జెన్‌కో అధికారులతో కలసి పరిశీలించారు. సీలేరు రెగ్యులేటర్‌ డ్యాం వద్ద మెగా కంపెనీ టన్నెల్‌ కోసం ప్రారంభించిన పనులను పరిశీలించారు. అనంతరం భూగర్భంలో జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించే పార్వతీనగర్‌ వద్దకు వెళ్లి అక్కడ జలవిద్యుత్‌ కేంద్రానికి సంబంధించిన డ్రాయింగ్‌లను పరిశీలించారు. దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని శాండికోరి వద్ద జలాశయం నిర్మించే ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాల పక్కనే నిర్మించిన మెగా కంపెనీ కార్యాలయాలను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా నిర్వహించాలని ఈ సందర్భంగా మెగా కంపెనీ ఏజీఎం రవిబాబును ఆదేశించారు. అనంతరం జెన్‌కో అతిఽథిగృహంలో సీలేరు కాంప్లెక్సు ఇంజనీర్ల్లతో సమీక్ష నిర్వహించారు. కాంప్లెక్సు పరిధిలో జరుగుతున్న పనులపై శాఖల వారీగా ఆయా ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సీలేరు పంప్డ్‌ స్టోరేజీ పనుల పురోగతిపై కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు, ఎస్‌ఈలు జాకీర్‌ హుస్సేన్‌, బాలకృష్ణ, శ్రీనివాసరెడ్డి, ఈఈ టి.అప్పలనాయుడు, డీఈఈలు జయపాల్‌, నాగార్జున, శ్యాం, ఏఈఈ సీహెచ్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 01:04 AM