సీలేరులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:36 PM
జీకేవీధి మండలం సీలేరులో గురువారం పంప్డ్ స్టోరేజీ కార్యాలయాన్ని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ప్రారంభించారు.
సీలేరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో గురువారం పంప్డ్ స్టోరేజీ కార్యాలయాన్ని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ప్రారంభించారు. సీలేరులో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నూతనంగా 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అధికారుల కోసం స్థానిక సివిల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఒక బ్లాక్‌ను ప్రత్యేకంగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కార్యాలయం కోసం కేటాయించారు. ఈ మేరకు ఈ కార్యాలయానికి అవసరమైన సౌకర్యాలన్నింటిని ఏర్పాటు చేశారు. ఇకపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఈ కార్యాలయం వద్ద ఇంజనీర్లు, సిబ్బంది నిర్వహించనున్నారని సీఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, ఏవో ఈవీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జి ఈఈ జైపాల్, పంప్డ్ స్టోరేజీ ఏడీఈ అప్పలనాయుడు, ఏఈఈ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.