Share News

జిల్లాలో పల్స్‌ పోలియో 92 శాతం నమోదు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:21 AM

జిల్లాలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం 92 శాతంగా నమోదైంది. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 86 వేల 125 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజు ఆదివారం 69 వేల 26 మంది చిన్నారులకు చుక్కల మందు వేశారు. దీం

జిల్లాలో పల్స్‌ పోలియో 92 శాతం నమోదు
హుకుంపేటలో చిన్నారికి చుక్కల మందు వేస్తున్న కలెక్టర్‌ నిషాంతి

- హుకుంపేటలో లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం 92 శాతంగా నమోదైంది. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 86 వేల 125 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజు ఆదివారం 69 వేల 26 మంది చిన్నారులకు చుక్కల మందు వేశారు. దీంతో జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం తొలి రోజు 92 శాతంగా నమోదైంది. కలెక్టర్‌ టి.నిషాంతి హుకుంపేటలో పలువురు చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన 857 బూత్‌ల్లో 3,304 మంది వైద్య సిబ్బంది పిల్లలకు పోలియో చుక్కల మందులు వేశారు. ఏదైనా కారణాలతో ఆదివారం చుక్కల మందు పొందని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి వారికి చుక్కల మందు వేస్తారని వైద్యులు తెలిపారు.

పల్స్‌ పోలియో సమాచారంపై వైద్యశాఖ నిర్లక్ష్యం

జిల్లాలో ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించే విషయంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆయా సమాచారాన్ని సేకరించి పాత్రికేయులకు తెలపాల్సిన సమాచార శాఖ అధికారులు సైతం వారి బాటలోనే పయనించడంతో పల్స్‌ పోలియో కార్యక్రమంపై కనీసం సమాచారం తెలియని పరిస్థితి ఏర్పడింది. పల్స్‌ పోలియో జాతీయ కార్యక్రమంతో పాటు కలెక్టర్‌ నిషాంతి ప్రారంభించినప్పటికీ దీనిపై సమాచారం ఇచ్చేందుకు అధికారులు కనీసం శ్రద్ధ కనబరచకపోవడం గమనార్హం.

Updated Date - Jun 29 , 2026 | 12:21 AM