ఓటర్ల డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ పూర్తి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:59 AM
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా డాఫ్ట్‌రోల్స్ ప్రచురణ పూర్తయ్యిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష జరిపారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా డాఫ్ట్‌రోల్స్ ప్రచురణ పూర్తయ్యిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి కలెక్టరేట్ నుంచి జేసీ శౌర్యమాన్‌పటేల్, డీఆర్‌ఓ సత్యనారాయణరావుతో కలిసి పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, బీఎస్‌ఓలు, బీఎల్‌ఏల సమావేశ మినిట్స్ కూడా అప్‌లోడ్ చేశామని తెలిపారు. మొత్తం 14,639 నోటీసులు జనరేట్ చేశామని, వీటిలో ఇప్పటివరకు 10 వేల నోటీసులను పంపిణీ చేశామని, మిగిలినవి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని వివరించారు. ఇప్పటివరకు 76 హియరింగ్స్ పూర్తయ్యాయని, గడువు ముగిసిన 701 నోటీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్టు చెప్పారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ఓటరు నమోదుకు సంబంధించి సుమారు 10 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు.