డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ పూర్తి
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:52 AM
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి నుంచి కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి నుంచి కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలను వివరించారు. డ్రాఫ్ట్‌రోల్స్ ప్రచురణ పూర్తయ్యిందని, బీఎల్‌వో, బీఎల్‌ఏల సమావేశ మినిట్స్ కూడా అప్‌లోడ్ చేశామని చెప్పారు. నాలుగు వేల వరకు ఉన్న పెండింగ్ అభ్యర్థనలు.. ఈ నెలలో చేపట్టిన చర్యలతో వెయ్యికి తగ్గాయని కలెక్టర్ చెప్పారు.