ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్‌టీయూ ధర్నా
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:17 PM
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని, 2003 డీఎస్సీకి ఎంపికైన వారికి పాత పెన్షన్ ఇవ్వాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెలే ్ఫర్ ఆఫీసర్లను నియమించాలని, జడ్పీ పరిధిలోని ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు కలెక్టర్ పరిధిలో జరగాలని, జీవో నంబరు 302 ప్రకారం జేఎల్ పదోన్నతులు కల్పించాలని, మునిసిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏలు ఇవ్వాలని, ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రద్దుచేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను గ్రేడ్-1 హెచ్‌ఎంలుగా మార్చాలనిఇ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కాశీవిశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్.పాపినాయుడు, నేతలు అప్పలరాజు, కృష్ణ, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.