స్పా ముసుగులో వ్యభిచారం
ABN , Publish Date - May 04 , 2026 | 01:05 AM
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతుండడంతో పోలీసులు దాడిచేసి నలుగురు మహిళలు, ఇద్దరు విటులతో సహా నిర్వాహకులను అరెస్టు చేశారు.
నలుగురు మహిళలు, ఇద్దరు విటుల అరెస్టు
సీతంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి):
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతుండడంతో పోలీసులు దాడిచేసి నలుగురు మహిళలు, ఇద్దరు విటులతో సహా నిర్వాహకులను అరెస్టు చేశారు. ద్వారకానగర్ రెండో లైన్ జీవీకే టవర్స్ రెండో అంతస్థులో బెల్ల థాయ్ స్పా, ఫుట్ రిలీఫ్ సెంటర్‌ను దాసరి కొండయ్య, వడ్డె స్వప్న అనే ఇద్దరు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌కు మేనేజర్‌గా గాంధీ సాయికుమార్, రిసెప్షనిస్ట్‌గా మేడిశెట్టి రేవతి పనిచేస్తున్నారు. స్పా పేరుతో మగవారికి ఆడవారితో మసాజ్ చేయించడంతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై అందిన సమాచారం మేరకు ద్వారకా సీఐ వెంకటరమణ, టాస్క్‌ఫోర్సు పోలీసులతో కలిసి ఆదివారం దాడి చేశారు.
పోలీసులు దాడి చేసిన సందర్భంలో కుమార్ ప్రభు, తొంగ దేముడునాయుడు మసాజ్ చేయించుకుంటూ పట్టాబడ్డారు. వారికి ఇద్దరు మహిళలు అర్ధనగ్నంగా మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు. స్పా సెంటర్‌లో పనిచేస్తున్న నలుగురు మహిళలను, వారి నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఒక డీవీఆర్, లెనోవా ట్యాబ్, రూ.14,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు స్పా నిర్వహణకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మహిళలను శక్తి సదన్ హోమ్‌కు తరలించారు.
స్పా సెంటర్ నిర్వాహకులు, ఇద్దరు మసాజ్ చేయించుకున్న పురుషులపై సీఐ వెంకట రమణ కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.