శంకుస్థాపనకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:07 AM
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
తర్లువాడను సందర్శించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం తర్లువాడలో సీపీ శంఖబ్రాత బాగ్చి, సీఎం భద్రతా అధికారితో కలిసి పర్యటించారు. ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం, సమావేశం నిర్వహించే హాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. గూగుల్, అదానీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.