Share News

సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:47 AM

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గన్నెల స్వర్ణ గ్రామ సచివాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, తదితర సమస్యలకు అధికారులకు 64 అర్జీలను ప్రజలు సమర్పించారు.

సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారం
అర్జీదారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ

అధికారులకు జేసీ ఆదేశం

- పీజీఆర్‌ఎస్‌లో 64 అర్జీల స్వీకరణ

అరకులోయ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గన్నెల స్వర్ణ గ్రామ సచివాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, తదితర సమస్యలకు అధికారులకు 64 అర్జీలను ప్రజలు సమర్పించారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, డీపీవో కేపీ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో రియాజ్‌బేగ్‌, జిల్లా అటవీ శాఖాధికారి ఉమా మహేశ్వరి, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:47 AM