Share News

సత్వరమే అర్జీల పరిష్కారం

ABN , Publish Date - May 27 , 2026 | 11:52 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి హెచ్చరించారు.

సత్వరమే అర్జీల పరిష్కారం
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

అలసత్వం వహిస్తే చర్యలు

అధికారులకు కలెక్టర్‌ నిషాంతి హెచ్చరిక

పీజీఆర్‌ఎస్‌లో 230 వినతుల స్వీకరణ

అనంతగిరి, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ఆమె హాజరై జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పర్యాటకంగా బొర్రాగుహలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపీడీవో, అటవీశాఖ అధికారులు, పర్యాటకశాఖ అధికారులు, తహశీల్దార్‌తో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బొర్రాగుహలకు వచ్చే పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:52 PM