Share News

ప్రతిభకు ప్రోత్సాహం

ABN , Publish Date - May 02 , 2026 | 11:52 PM

పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎలమంచిలి విద్యార్థిని ఆడారి ప్రణతితో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులతో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ప్రతిభకు ప్రోత్సాహం
టెన్త్‌ పరీక్షల్లో జిల్లా ఫస్ట్‌ వచ్చిన విద్యార్థినితో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న డీవైఈవో, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు

టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌ విద్యార్థిని, ఉత్తమ ఫలితాలు సాధించిన వారితో విజయోత్సవ ర్యాలీ

ఎలమంచిలి, మే 2 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎలమంచిలి విద్యార్థిని ఆడారి ప్రణతితో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులతో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎలమంచిలి పురవీధుల్లో ఓపెన్‌ టాప్‌ కారులో ప్రణతిని, వ్యాన్‌లో మిగతా విద్యార్థినులను ఉంచి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని డిప్యూటీ డీఈవో అప్పారావు, ఎంఈవోలు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో అప్పారావు మాట్లాడుతూ ఎలమంచిలి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని ఆడారి ప్రణతి జిల్లా ఫస్ట్‌ రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు బీవీఎస్‌ సాయిబాబా, వైవీ రమణ, మల్లిపాటి సత్యనారాయణ, సుశీల, ఉపాధ్యాయులు విశ్వేశ్వరరావు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:52 PM