Share News

ఏజెన్సీలో వేరుశనగ సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:01 AM

గిరిజన ప్రాంతంలో వేరుశనగ పంట విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) బీవీ తిరుమలరావు అన్నారు.

ఏజెన్సీలో వేరుశనగ సాగుకు ప్రోత్సాహం

సబ్‌ డివిజన్‌లో 2000 ఎకరాల్లో సాగు

పంపిణీకి సిద్ధంగా విత్తనాలు

ఏడీఏ తిరుమలరావు

చింతపల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో వేరుశనగ పంట విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) బీవీ తిరుమలరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతం వేరుశనగ సాగుకి అత్యంత అనుకూలమన్నారు. గిరిజన రైతులు ఆహారం కోసం అతితక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్నారు. వేరుశనగ పంటను వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తుందన్నారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో రెండు వేల ఎకరాల్లో వేరుశనగ పంటను పండించేందుకు అవసరమైన విత్తనాలను మండల కేంద్రాలకు వచ్చాయన్నారు. చింతపల్లికి 630 క్వింటాళ్లు, జీకేవీధికి 450, కొయ్యూరుకి 60 క్వింటాళ్లు కేటాయించామన్నారు. మేలిజాతి టీసీజీఎస్‌ 1694 రకం విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలతోపాటు నీమ్‌ ఆయిల్‌ రాయుతీపై పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సాగు విస్తీర్ణాణాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రాలు ద్వారా విత్తనాలు పొందవచ్చునన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ అధికారి టి.మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:01 AM