Share News

ఆకాంక్షిత జిల్లాలో ప్రగతి సాధించాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:28 AM

ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం(ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌)లో భాగంగా ఉద్దేశించిన ప్రగతిని సాధించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నీతి అయోగ్‌ ప్రతినిధి కార్తిక్‌ రెడ్డిలతో కలిసి బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం అమలు చేస్తున్నదన్నారు.

ఆకాంక్షిత జిల్లాలో ప్రగతి సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నీతి అయోగ్‌ ప్రతినిధి కార్తిక్‌రెడ్డి

- అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదే శం

పాడేరు, జూలై 2(ఆంధ్ర జ్యోతి): ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం(ఆస్పిరేషనల్‌

డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌)లో భాగంగా ఉద్దేశించిన ప్రగతిని సాధించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నీతి అయోగ్‌ ప్రతినిధి కార్తిక్‌ రెడ్డిలతో కలిసి బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం ద్వారా జిల్లాలో ఆయా రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించేందుకు అవకాశం కలిగిందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు కృషి చేసి ఆశించిన ఫలితాలు సాధిస్తే గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులకు అప్పగించిన పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పనులను అధికారులు నిత్యం పర్యవేక్షించడంతో పాటు ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. నీతి అయోగ్‌ ప్రతినిఽధి కార్తిక్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు. రైతు సేవా కేంద్రాలు, వన్‌దన్‌ వికాస కేంద్రాలు, సామాజిక భవనాలను పరిశీలించామన్నారు. ఆయా అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వ శాఖల అధికారులను ఆయన అభినందించారు. క్షేత్రస్థాయిలో చక్కని ఫలితాల సాధనకు, చేపట్టిన పనుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు మరింత శ్రద్ధ కనబరచాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశఽ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ పీడీ వి.మురళి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, జిల్లా ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రహీమ్‌, జిల్లా సెరీకల్చర్‌ అధికారి అప్పారావు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:28 AM